చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న భౌగోళిక మరియు ఆర్థిక ఇబ్బందులను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. చెన్నైలో ధర్మాసనం ఏర్పాటు చేయడం వల్ల అన్ని దక్షిణ రాష్ట్రాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఇది దేశ సమాఖ్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.