కాణిపాకం బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనసేవ సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రప్రభ వాహనసేవలో అగరంపల్లి ఎక్స్ ఈవో శ్రీ వినాయక స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం చేసుకుని తరించారు.