ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు మద్దతు: ప్రభుత్వ విధానాలపై ఎంసీపీఐయూ ఆగ్రహం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంసీపీఐయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి అండగా ఉంటామని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ స్పష్టం చేశారు. వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు.