అమరావతిలో వేగవంతంగా నిర్మాణ పనులు: అధికారులకు ఏడీసీ సీఎండీ ఆదేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

అమరావతిలో జరుగుతున్న ట్రంక్ రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్ల నిర్మాణ పనులను ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద నియంత్రణ పనులను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ-6, ఎన్-9 రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్లను సకాలంలో పూర్తి చేసి అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.