హైదరాబాద్లో కుండపోత వర్షం అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.