ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీపై డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
ధరాపురం మరియు మధురాంతకం ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులను ప్రజలే తరిమికొట్టారని, ఓటమి భయంతోనే వాళ్లు డబ్బు, వస్తువులు పంపిణీ చేస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ తీవ్రంగా మండిపడ్డారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీల గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు.