ఆహార భద్రతకు ఏపీఎఫ్డీఏ పాలసీ: ఏకీకృత విధానం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఆహార, ఔషధ భద్రతను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కీలక విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి నాసిరకం ఉత్పత్తుల కట్టడికి చర్యలు చేపట్టనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పర్యవేక్షణలో ఏపీఎఫ్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.