పోలీసు వాహనాల నిర్వహణలో పాలకుల ఆదేశాలను విస్మరిస్తే చర్యలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లాలో పోలీసు వాహనాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీసు వాహనాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల్లో అత్యవసర, రక్షణ సామగ్రి తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. లోపాలను వెంటనే సరిచేసి, వాహనాలను ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచాలని, అత్యవసర సేవలకు వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.