భారీ పౌరాణిక చిత్రం రామాయణ తెలుగు హక్కులను దక్కించుకున్న నిర్మాత దిల్ రాజు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకుందని చిత్ర బృందం వెల్లడించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ మూవీలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం అందుతోంది.