రాజమౌళి-మహేష్‌ బాబు 'వారణాసి' సినిమా కథాంశం లీక్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'వారణాసి'పై భారీ అంచనాలున్నాయి. క్రీ.పూ 7000 సంవత్సరాల క్రితం మొదలై వర్తమానం వరకు సాగే టైమ్‌ ట్రావెల్, మైథాలజికల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మహేష్ శివ భక్తుడు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన తారాగణం.