కోహెడ చెరువు కబ్జాపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపే హైడ్రా కాంగ్రెస్ కబ్జాలపై మాత్రం ఎందుకు కండ్లు మూసుకున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో నిలదీశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని చిన్నచెరువును కబ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేపడుతున్న తీరుపై మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చెరువును ధ్వంసం చేస్తున్న కబ్జాదారులపై, వారికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.