భూమిలో డ్రమ్ములు పాతి కోట్ల రూపాయల నగదు దాచిపెట్టిన వైనం: నివ్వెరపోయిన పోలీసులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ప్రయాగ్రాజ్
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల నుంచి కుప్పల కొద్ది నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. బరాయిపుర్ గ్రామానికి చెందిన రాకేశ్ యాదవ్ ఇంట్లో పోలీసులు జరిపిన తవ్వకాల్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైందని గంగానగర్ డీసీపీ సోనమ్ కుమార్ వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు వదిలి ఊరికి వచ్చిన ఈ సోదరుల ఆకస్మిక ధనవంతుల తీరుపై అనుమానంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.