సాలూరులో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య రాణి

రిపోర్టర్: మహేష్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో స్థానిక నేత సంధ్య రాణి పార్వతీపురం పాల్గొని మాట్లాడారు. పిల్లలు బాగా చదవాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. విద్యతో పాటు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన అని ఆమె ప్రశంసించారు. ఆరోగ్యకరమైన పిల్లలే బలమైన ఆంధ్రప్రదేశ్కు అసలైన బలం అని ఈ సందర్భంగా సంధ్య రాణి పార్వతీపురం అభివర్ణించారు.