లేబర్ కోర్టు జప్తు చేసిన జీపు ఫర్నిచర్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ కార్యాలయం నుంచి గతంలో గోదావరిఖని లేబర్ కోర్టు జప్తు చేసిన వాహనాన్ని ఫర్నిచర్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్యాలయంలో పనిచేసిన కొందరు వ్యక్తులు లేబర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇస్తూ.. మద్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీంతో స్వాధీనం చేసుకున్న జీపు ఫర్నిచర్ ను మళ్లీ అటవీ శాఖకు అప్పగించాలని పేర్కొన్నారు.