సినిమా అప్డేట్: కిరణ్ అబ్బవరం రియాలిటీ చిత్రం నుంచి తొలిపాట విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

యువ హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రియాలిటీ సినిమా నుంచి మేకర్స్ తొలిపాటను గురువారం విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన భజగోవిందం పాటను వైకోమ్ విజయలక్ష్మి ఆలపించగా సనారే సాహిత్యం అందించారని తెలిపారు. డిసెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.