హైదరాబాద్ లో భారీ కల్తీ పాల గుట్టురట్టు: వంద లీటర్ల పాలు సీజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి ప్రధాన నిందితుడు అందె శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి వంద లీటర్ల కల్తీ పాలు, రసాయనాలు, పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.