పెద్దపల్లి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లలో తీవ్ర గందరగోళం
రిపోర్టర్: విజయ్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా పునఃపరిశీలన ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అవగాహన కొరవడటంతో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఏ పత్రాలు సమర్పించాలి, ఫారం ఇస్తే ఓటు పోతుందా అనే అనుమానాలతో వృద్ధులు, నిరక్షరాస్యులు బీఎల్ఓల చుట్టూ తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అధికారుల నుంచి సరైన స్పష్టత రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.