అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్తంగా నిషేధానికి FSSAI సన్నాహాలు!
రిపోర్టర్: గోపి
స్థలం: India
పాలతో తయారయ్యే అసలైన పనీర్ పేరుతో వెజిటబుల్ ఆయిల్, ఫ్యాట్ లతో విక్రయిస్తున్న 'అనలాగ్ పనీర్'పై కేంద్ర ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను మోసగిస్తున్న ఈ నాన్-డెయిరీ పనీర్ తయారీ మరియు విక్రయాలపై ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించే దిశగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన నిబంధనలను రూపొందిస్తోంది.