ఎన్బీఏ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన అవ్సార్ థాంప్సన్
రిపోర్టర్: శివ
స్థలం: World
ఎన్బీఏలో డిట్రాయిట్ పిస్టన్స్ ఫార్వర్డ్ అవ్సార్ థాంప్సన్ ఐదేళ్ల కాలానికి 155 మిలియన్ డాలర్ల భారీ రూకీ కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందం కుదుర్చుకున్నారు. అసాధారణ డిఫెన్సివ్ నైపుణ్యాలతో రాణిస్తున్న అతడు తన కవల సోదరుడు అమేన్ థాంప్సన్తో కలిసి ఎన్బీఏ చరిత్రలో వంద మిలియన్లకు పైగా కాంట్రాక్టులు దక్కించుకున్న తొలి కవలలుగా రికార్డు సృష్టించారు.