తుమ్మిడిహట్టి అలైన్మెంట్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష: అధికారులకు ఆదేశాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సూర్యాపేట
మహారాష్ట్ర లేవనెత్తుతున్న అభ్యంతరాలపై సాంకేతికంగా మెరుగైన, ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేటలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో తుమ్మిడిహట్టి అలైన్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులు, స్థానికుల ప్రయోజనాలను కాపాడుతూనే సమస్యను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్ట్ ప్రగతిని మంత్రికి వివరించారు.