రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెదిన్ పూర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ ఐ జి. బాలకృష్ణ తెలిపారు. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, మృతుడి ఎడమ చేతిపై కిష్టయ్య అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ వెల్లడించారు.