పర్యావరణ హితం కోసం మట్టి వినాయకుల పంపిణీ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. దాతల డా. శ్రీనివాస్ ప్రసాద్ నీరజ దేవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, లయన్స్ జోన్ చైర్పర్సన్ ఉప్పు ఆంజనేయులు చేతుల మీదుగా ప్రజలకు ప్రతిమలను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఎండీ అత్తహర్ పాషా, కార్యదర్శి దాచేపల్లి రాజు, కోశాధికారి బత్తిని రఘుతో పాటు పలువురు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.