బెల్లంపల్లి పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్లకు నోటీసులు అందజేసిన బీఎల్ఓలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతంలోని 73, 74 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు ప్రజలకు నోటీసులు అందజేశారు. ఓటర్ల జాబితాలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు రాజేశ్వరి, కనకధార, గాండ్ల మహేష్ పాల్గొని స్థానికులకు అవగాహన కల్పించారు.