అక్టోబర్ పదహారున రణబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం రణబాలి విడుదల వాయిదా పడుతుందనే వదంతులకు తెరదించుతూ చిత్రబృందం శనివారం కొత్త పోస్టర్ను విడుదల చేసిందని మేకర్స్ తెలిపారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్రిటీష్ పాలనాకాలం నాటి యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.