'ప్రతి ఇంటా ఇందిరాగాంధీ ఫొటో పెట్టి పూజిస్తున్నారు': సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ ఫొటో పెట్టుకొని ప్రజలు దేవతలా పూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని, తెలంగాణపై ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందని, ఇందిరా స్ఫూర్తితోనే పాలన కొనసాగిస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు.