అంతర్జాతీయ రక్షణ ఒప్పందం: సౌదీ అరేబియాకు మద్దతుగా పాక్, తుర్కియే సైనిక కూటమి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: రియాద్
యెమెన్‌లోని హూతీల నుంచి సౌదీ అరేబియాకు భద్రతా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్, తుర్కియే దేశాల మద్దతు కీలకంగా మారింది. మూడు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడానికి తాజా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. సౌదీకి అవసరమైన సైనిక బలగాలను మోహరించేందుకు చర్యలు చేపట్టామని, మక్కా రక్షణ కూటమి వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొలి సెక్రటరీ జనరల్‌ను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు.