ఫేక్ ఫారం-7 దరఖాస్తులపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వస్తున్న బోగస్ ఫారం-7 దరఖాస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ముషీరాబాద్, బహదూర్ పుర నియోజకవర్గాల్లో ప్రీ ప్రింటెడ్ ఫారమ్లు వెలుగుచూడటం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. తప్పుడు సమాచారం ఇస్తూ ఓట్ల తొలగింపునకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలను ఆయన హెచ్చరించారు.