మనుబోలులో ఉచిత వైద్య శిబిరం: ఘనంగా ప్రధాని సేవా అభినయన్

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

మనుబోలు మండల కేంద్రంలోని సచివాలయంలో డాక్టర్ గేయ పూజిత ఆధ్వర్యంలో ప్రధాని సేవా అభినయన్ కింద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నీటి సంఘ అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డికి నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.