ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా కృష్ణా జలాలను ఏపీకి తరలిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది చంద్రబాబుకు ఇస్తున్న గురుదక్షిణగా అభివర్ణించారు. బీమా, కల్వకుర్తి మోటార్లు నిలిపివేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దమ్ముంటే నీటి తరలింపును అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.