నగర శివారులో భారీ షాక్: రూ.6.7 కోట్ల నకిలీ కరెన్సీ సీజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అబ్దుల్లాపూర్ మెట్
హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో భారీగా చలామణి చేసేందుకు సిద్ధం చేసిన నకిలీ కరెన్సీ ముఠా గుట్టును ఎస్ ఓటీ పోలీసులు రట్టు చేశారని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రూ.6.7 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తోందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.