చిన్న వయసులోనే పెరుగుతున్న ముప్పు: యువతను వణికిస్తున్న పక్షవాతం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
ముప్పై ఐదేళ్ల వయసులోనే పక్షవాతం బారిన పడుతున్న యువత సంఖ్య పెరుగుతోందని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ న్యూరాలజీ నిపుణులు డాక్టర్ సుర్బి చతుర్వేది తెలిపారు. హైబీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే స్ట్రోక్ ముప్పు ముంచుకొస్తోందని పేర్కొన్నారు. ముఖం ఒకవైపు వాలిపోవడం, మాట్లాడడంలో ఇబ్బంది, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.