ఉద్యమకారుల ఆకాంక్షలను విస్మరిస్తున్న పాలకుల నిర్లక్ష్య వైఖరి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులకు 250 గజాల ప్రభుత్వ స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, అచ్చ భాగ్యలక్ష్మి, గద్దెల ధర్మేందర్, అచ్చ సత్తయ్య, తుంగపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.