వర్ధన్నపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో.. జాతీయ రహదారిపై నిరసన
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. అసెంబ్లీలో తమ ప్రజా ప్రతినిధుల అరెస్టును నిరసిస్తూ, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.