వైజాగ్ డైమండ్ పార్క్ సమీపంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఫినాయిల్ సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడిని ద్వారక శక్తి టీం పోలీసులు ప్రాణాలతో రక్షించినట్లు VizagCityPolice వెల్లడించారు. డైమండ్ పార్క్లో అవగాహన కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటనను గుర్తించిన సిబ్బంది, వెంటనే స్పందించి క్షతగాత్రుడికి తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు ప్రాణాపాయం తప్పించి సురక్షితంగా స్నేహితుడికి అప్పగించారు.