ఆమనగల్లు పీఏసీఎస్ చైర్పర్సన్గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kadthal

ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఆయనతో పాటు మరో పన్నెండు మందిని సంఘం సభ్యులుగా నియమించినట్లు వెల్లడించారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీ ఆరు నెలల పాటు లేదా తదుపరి ఎన్నికలు జరిగే వరకు అధికారంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.