ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కలిసి ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని బెళగావిలో కేవలం మూడు రోజుల్లోనే వేలాది మంది ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరిగిందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి అప్రూవర్గా మారాలని ఆయన డిమాండ్ చేశారు.