ఐఐటీ బాంబేలో విద్యార్థుల ఆందోళనకు తెర దించుతూ 18 డిమాండ్లకు అంగీకరించిన డైరెక్టర్
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు తెరపడింది. విద్యార్థులు సమర్పించిన 18 డిమాండ్ల చార్టర్‌పై డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే సంతకం చేశారు. బాధ్యులపై చర్యలు, స్వతంత్ర దర్యాప్తుతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ, విద్యార్థుల సంక్షేమ సంస్కరణలకు యాజమాన్యం అంగీకరించింది.