ప్రయాణికులకు తీపి కబురు: నేడు మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ల ఆవిష్కరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

ప్రజా రవాణా అనుసంధానాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో మెట్రో మరియు ఆర్టీసి సంయుక్తంగా ప్రవేశపెడుతున్న ఉమ్మడి పాస్లను శుక్రవారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రోజువారీ ఉమ్మడి పాస్ ధరను నాలుగు వందల రూపాయలుగా మరియు నెలవారీ పాస్ ధరను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా ఖరారు చేసినట్లు వారు వెల్లడించారు.