దిల్లీలో ఇరాన్ అధ్యక్షుడు, యూఏఈ యువరాజు కీలక భేటీ

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేదికగా యూఏఈ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శనివారం సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం, ఉద్రిక్తతల నివారణ, ప్రాంతీయ స్థిరత్వం, వాణిజ్యం మరియు భద్రతా అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవలి డ్రోన్ దాడి ఆరోపణల నేపథ్యంలో ఈ దౌత్యపరమైన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.