రిబ్బన్ కటింగ్ సీఎంగా రేవంత్ రెడ్డి మారారంటూ ప్రశాంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా, కేసీఆర్ హయాంలో సిద్ధమైన వాటిని ప్రారంభించడమే తప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు.