ప్రకాశం జిల్లాలో భారీ షాకింగ్ ఘటన: ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలుడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. పాజర్లకు చెందిన తిరుమల అనే వ్యక్తి మొబైల్కు ఛార్జింగ్ పెట్టి కూలీ పనికి వెళ్లగా ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.