తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తితిదే, పోలీస్ శాఖలు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పర్యటన, గరుడసేవ రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.