అమరావతిలో అర్బన్ ఇన్నోవేషన్ సెంటర్: ఏపీ ప్రభుత్వంతో ఐక్యరాజ్యసమితి ఒప్పందం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు మంత్రి నారాయణ సమక్షంలో కీలక ఒప్పంద పత్రాలు మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అర్బన్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి నిర్మాణంలో ఈ కేంద్రం ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు, పట్టణాభివృద్ధి నిపుణులతో కలిసి ఈ కేంద్రం పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.