పాలకొండ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకుల సుడిగాలి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి నుంచి ఏడో వార్డులలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, టీడీపీ ఇన్చార్జ్ పడాల భూదేవి విస్తృతంగా పర్యటించారు. కూటమి చైర్పర్సన్ అభ్యర్థి పల్లా విజయ నిర్మలతో పాటు వివిధ వార్డుల అభ్యర్థులకు సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు స్థానిక ఓటర్లను కోరారు.