విమానాశ్రయాల ప్రైవేటీకరణ: పీపీపీ విధానంలో పదకొండు ఎయిర్పోర్టుల నిర్వహణకు కేంద్రం సన్నాహాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తిరుపతి
దేశంలోని పదకొండు ప్రధాన విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయాలను యాభై సంవత్సరాల దీర్ఘకాలిక రాయితీ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే డిసెంబర్ నాటికి గ్లోబల్ బిడ్లను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో దేశీయ విమానయాన రంగం మరింత ఆధునికీకరణ వైపు పయనిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.