నర్సంపేట వాగులో మొసలి కలకలం అటవీశాఖ సిబ్బంది పట్టివేత
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట శివారు బొజ్జ నాయక్ తండావాగులో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, ఎఫ్బవో వెంకన్న ఆధ్వర్యంలో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మొసలిని సురక్షితంగా పట్టుకుని పాకాల సరస్సులో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వాగు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.