పాస్పోర్ట్ రెన్యూవల్ చేయకపోతే ఊరుకోనంటూ కేంద్ర పెద్దలపై కేఏ పాల్ ఆగ్రహం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత మూడు నెలలుగా తన పాస్పోర్ట్ పునరుద్ధరణను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్లోని ఎంబసీ ఎదుట వీడియో విడుదల చేసిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్లను తీవ్ర పదజాలంతో నిలదీశారు. తాను భారత్కు రాకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాస్పోర్ట్ రెన్యూవల్ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.