రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: sujith reddy స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వాధినేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికల వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి శూన్యమైందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.