బడిలో ఉండాల్సిన బాలుడు పశువుల కాపరిగా మారడంపై మంత్రి లోకేశ్ ఆవేదన

రిపోర్టర్: విజయ్ స్థలం: ప్రకాశం

బడిలో ఉండాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు రామయ్య కుటుంబ పోషణలో భాగంగా పశువుల కాపరిగా మారిన ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో వెలుగు చూసింది. తనను తల్లిదండ్రులు జీతానికి పంపారంటూ ఆ పిల్లాడు కన్నీరుమున్నీరుగా విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బాలుడిని సురక్షితంగా రక్షించి చదివించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించినట్లు వెల్లడించారు.