బర్డ్ ఫ్లూ కలకలం: అనంతపురంలో రెండున్నర వేల కోళ్లు మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు దిగుమతి చేసుకున్న కోళ్లలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా సోకడంతో సుమారు రెండు వేల ఐదు వందల కోళ్లు మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు. సిద్ధరాంపురానికి చెందిన వెంకటరాముడు అనే రైతు పౌల్ట్రీ ఫారమ్ కోసం కొనుగోలు చేసిన ఈ కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడంతో శాస్త్రవేత్తలు నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం బయటపడింది.